Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పులిచింతల ప్రాజెక్టు డ్యామ్ వద్ద కొట్టుకుపోయిన 16వ నంబరు గేటు స్తానంలో స్టాప్ లాక్ గేటును అధికారులు ఎట్టకేలకు అమర్చారు. సుమారు 80 మందికిపైగా సిబ్బంది దాదాపు 20 గంటలపాటు శ్రమించి గేటును విజయవంతంగా అమర్చారు. నిన్న రాత్రి 1 గంట వరకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో 11ఎలిమెంట్లను అమర్చిన టెక్నికల్ సిబ్బంది కొద్దిసేపటి క్రితం 16వ నెంబర్ స్టాప్ లాక్ గేటు అమరికను విజయవంతంగా పూర్తి చేశారు.