Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా రెండు ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని హైదరాబాద్ సిటీలోనే ఏర్పాటు చేశారు. ట్రాన్స్జెండర్ల హక్కులకు రక్షణ కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ యాక్ట్ - 2019 అమలులో భాగంగా తొలుత దేశవ్యాప్తంగా పలు మెట్రో సిటీల్లో పత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి రెండుట్రాన్స్ క్లినిక్‌లను హైదరాబాద్ సిటీకి కేటాయించింది. వాటిలో ఒకటి నారాయణగూడలో ఈ ఏడాది జనవరి 29న, రెండోది జీడిమెట్లలో జులై 11న ప్రారంభమయ్యాయి. జీడిమెట్లలోని క్లినిక్‌ను ఫేమస్ డ్రాగ్ ఆర్టిస్ట్ సుశాంత్ దివ్గికర్ ప్రారంభించారు. ఈ క్లినిక్‌లలో సేవలందించే వారు కూడా ట్రాన్స్జెండర్లే కావడం విశేషం. ఇక్కడ హిజ్రాలు, ట్రాన్స్మెన్, క్రాస్డ్రసెర్లు, జెండర్ నాన్ కన్ఫామింగ్ పీపుల్, జోగినులు, శివ శక్తులు సహా ట్రాన్స్ కమ్యూనిటీ కిందకు వచ్చే వాళ్లందరికీ వైద్య సేవలు అందుతాయి. సాధారణ వైద్య సేవలతో పాటు హార్మోన్ థెరపీ, గైడెన్స్, మానసిక ఆరోగ్య సమస్యలకు కౌన్సెలింగ్, హెచ్ఐవీ, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చాక అవసరమ్యే ట్రీట్మెంట్స్, లీగల్ సమస్యలకు సాయం, సామాజికంగా ఎదురయ్యే సమస్యలకు రక్షణ కూడా ఇక్కడ దొరుకుతుంది.