Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొద్దిమేర తగ్గింది. తాజాగా కొత్త కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపించింది. ఆదివారం 13,71,871 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 35,499 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసులు 9 శాతం మేర క్షీణించాయి. అందుకు నిర్ధారణ పరీక్షల సంఖ్యలో తగ్గుదల కూడా కారణంగా కనిపిస్తోంది. నిన్న మరో 477 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.19 కోట్లకు చేరగా.. 4.28లక్షల మంది మరణించారని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రియాశీల కేసుల సంఖ్య 4,02,188(1.26 శాతం)గా ఉంది. నిన్న 39 వేల మంది కోలుకున్నారు. మొత్తంగా వైరస్‌ను జయించినవారి సంఖ్య 3.11 కోట్లకు చేరింది. రికవరీ రేటు 97.40 శాతానికి పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో పంపిణీ అయిన డోసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. నిన్న 16,11,590 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటివరకు 58.86లక్షల డోసులు ప్రజలకు అందాయి.