Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మాదాపూర్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్పై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఉన్నత ఆధికారుల బంధువు కావడంతో విషయం బయటికి రాకుండా చూస్తున్నారు. శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో తమనే ఆపుతావా అంటూ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పైనే ఇద్దరు వాహనదారులు చేయి చేసుకున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసినప్పటికీ ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత అధికారుల బంధువు కావడంతోనే పోలీసులు సైలెంట్ అయ్యారని విమర్శలు వినవస్తున్నాయి.