Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గోదావరి, కృష్ణా బోర్డుల ఉమ్మడి అత్యవసర సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు జలసౌధలో జరగనుంది. ఈ భేటీకి హాజరుకావాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు బోర్డులు లేఖలు రాశాయి. అయితే ఈ సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణ తెలిపింది. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసుల విచారణ ఉన్న నేపథ్యంలో హాజరుకాలేమని, మరో తేదీని ఖరారు చేయాలని తెలంగాణ కోరింది. కాగా ఈ సమావేశాన్ని యాధావిధిగా కొనసాగించే ఆలోచనలో కృష్ణా, గోదావరి బోర్డులు ఉన్నాయి. సమావేశానికి ఏపీ అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది.