Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పెండ్లైన నెల రోజులకే ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలాపూర్ ఇన్స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. వట్టేపల్లికి చెందిన షబ్బీర్ అలీ కుమార్తె షాహీన్ బేగం(25), న్యూబాబానగర్కు చెందిన ఇస్మాయిల్ బిన్ అలీకి జూలై 9న వివాహం అయింది. శనివారం రాత్రి ఇస్మాయిల్ తన అత్తమామలకు ఫోన్ చేసి మీ కుమార్తె ఉరేసుకుందని చెప్పాడు. వారు వెంటనే కుమార్తె అత్తగారింటికి వెళ్లారు. తమ కుమార్తెను భర్త, అత్తమామలు చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.