Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు ఊచకోత కోశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 40 మంది పౌరులు మృతిచెందారు. నైజర్ బోర్డర్ సమీపంలో ఉన్న ఓ గ్రామంపై జిహాదీలు దాడి చేశారు. కౌరో అనే గ్రామంలో 20 మందిని, ఓటగావులో 14 మందిని, దౌత్గెఫ్ట్లో కొందర్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. మోటార్‌బైక్‌లపై వచ్చిన ఉగ్రవాదులు గ్రామంలో బీభత్సం సృష్టించారు. వెస్ట్ ఆఫ్రికా దేశమైన మాలిలో 2012 నుంచి జిహాదీలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆల్ఖయిదాకు చెందిన సాయుధ దళాలు దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. దశాబ్ధ కాలం నుంచి జరుగుతున్న ఊచకోత వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.