Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఆటో సూచీల అండతో మళ్లీ కోలుకుని లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 125 పాయింట్లు లాభపడి 54,403కి చేరుకుంది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 16,258 వద్ద స్థిరపడింది.