Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నేడు బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. పసిడి ధర నెల చూపులు చూస్తుంది. న్యూఢిల్లీ బులియన్ జ్యూవెలరీ మార్కెట్లో ఆగస్టు 6న రూ.47,731లుగా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నేడు 1,175 రూపాయలు పడిపోయి రూ.46,556 చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.43,722 నుంచి రూ.42,645 పడిపోయింది. ప్రపంచ మార్కెట్లలో కూడా బంగారం రేట్లు నేడు 4.4% వరకు పడిపోయాయి, ఎందుకంటే అమెరికాలో ఉద్యోగాల నియామక ప్రక్రియ ఫెడరల్ రిజర్వ్ ఊహించిన దానికంటే వేగంగా పెరగడం, గోల్డ్ మీద పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో బంగారం ధర తగ్గినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,830 నుంచి రూ.530 పడిపోయి రూ.47,300కు చేరుకుంది.