Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదిలాబాద్: దళిత సోదరులకు అండగా ఉంటానని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంద్రవెళ్లి దళిత, గిరిజన దండోరా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దళితుడికి రాష్ట్రపతి పదవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్ను చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. రిజర్వేషన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఉపఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు దళితులు గుర్తుకు వచ్చారని, కేసీఆర్ మంత్రివర్గంలో మాదిగలకు స్థానమే లేదని విమర్శించారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు తోడు, నీడగా ఉంటానని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సమైక్యపాలనలో అడవి బిడ్డలను కాల్చేస్తుంటే... ఈ ప్రాంత నేతలు నిస్సహాయులుగా నిలిచిపోయారని ఆరోపించారు.