Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గిరిజనుల హక్కుల సాధన కోసం చేసే పోరాటాల్లో అండగా ఉంటామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. పన్నుల భారంతో పేదలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాబోయే రోజుల్లో పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని తమ్మినేని వీరభధ్రం ప్రకటించారు.