Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించి సగర్వంగా తిరిగి వచ్చిన క్రీడాకారులకు ఘనస్వాగతం లభించింది. న్యూఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం క్రీడాకారుల కుటుంబసభ్యులు, క్రీడాభిమానులతో కిక్కిరిసిపోయింది. భారత్ మాతా కీ జై.. నినాదాలు మార్మోగాయి. సూర్మ నీరజ్ చోప్రా, రవి దహియా, బజరంగ్ పూనియా, లోవ్లినా బోర్గోహైన్ తోపాటు పురుష, మహిళా హాకీ క్రీడాకారులు సోమవారం సాయంత్రం భారతదేశానికి తిరిగి వచ్చారు. అథ్లెట్లందరికీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఒలింపిక్ ఛాంపియన్లకు బ్యాండ్ వాగన్తో స్వాగతం పలికారు. గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతో సెల్ఫీ తీసుకోవడానికి జనాలు ఎగబడ్డారు. అలాగే, లవ్లినా బోర్గోహైన్, బజరంగ్ పూనియా, రవి దహియా, దీపక్ పూనియా కూడా ఢిల్లీ చేరుకున్నారు.