Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,43,927 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 65,943 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.30 అడుగులకు నీరు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.8070 టీఎంసీలు, ప్రస్తుతం 211.4759 టీఎంసీల నీరు ప్రాజెక్ట్‌లో ఉంది. వరద ప్రవాహం తగ్గనప్పటికీ.. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.