Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కరోనా మహమ్మారి ఎంతో ప్రాణాలని బలిగొంటున్న విషయం తెలిసిందే. సామాన్యులు, సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి కన్నుమూస్తున్నారు. గత ఏడాదిగా ఇండస్ట్రీలో ప్రముఖుల మరణాల గురించి చాలానే వింటున్నాం. తాజాగా ప్రముఖ మలయాళ నటి శరణ్య శశి (33) కన్నుమూసారు. ఆమె పదేళ్లుగా క్యాన్సర్తో పోరాడుతుండగా, ఈ మధ్య కరోనా సోకింది. కరోనా నుండి కోలుకుంటున్న సమయంలో ఆరోగ్యం విషమించడంతో కన్నుమూసింది. శరణ్య శశి(35) ఆగస్ట్ 9న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లారు. క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.. ఒకటీ రెండు కాదు, ఏకంగా 10ఏళ్లపాటు మహమ్మారితో తలపడింది. అలాంటి ఆమెను కరోనా సైతం వదల్లేదు. కరోనా నుండి కోలుకుంటుంది అనుకునే లోపు ఆమెకు ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడాయి. న్యుమోనియాతో పాటు రక్తంలో స్టోడియం స్థాయిలు పడిపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసింది. మంత్రకోడి, సీత మరియు హరిచందనం సహా పలు మలయాళ టీవీ సిరియల్స్తో బాగా పాపులర్ అయిన శరణ్య పలు సినిమాల్లో సహాయక పాత్రలను కూడా పోషించింది.ఆమె మృతికి పలవురు ప్రముఖులు నివాళులు అర్పించారు.