Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తల్లి వెంట వచ్చిన కుమార్తెపై ప్రమాదవశాత్తు బీరువా పడటంతో మృతి చెందింది. మేడిపల్లి పోలీసుల వివరాల ప్రకారం.. బోడుప్పల్ దేవేందర్నగర్కాలనీలో నివసించే కుంచాల మధు, లత దంపతులకు ముగ్గురు కుమార్తెలున్నారు. లత స్థానిక సిద్ధార్థ పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్నారు. సోమవారం పాఠశాలలో పని నిమిత్తం లత కుమార్తె కీర్తి(8)తో కలిసి వచ్చారు. బీరువాలు శుభ్రంచేస్తుండగా ప్రమాదవశాత్తు ఒకటి చిన్నారిపై పడింది. తీవ్ర గాయాలైన బాలికనుఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మేడిపల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు దిగగా విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి.