Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సంగారెడ్డి శివారులోని వైకుంఠపురం ఆలయం వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు బండరాయితో కొట్టి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తిని సంగారెడ్డి పిండిబజార్కు చెందిన ఆగమయ్యగా గుర్తించారు. అయితే, హత్యకు భూతగాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.