Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సింగర్ సునీత తాజాగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేక్షకులతో ముచ్చటిస్తూ పలు విషయాలు తెలిపింది. పాట పాడేందుకు వెళ్లి ఓ సారి ఎదుర్కొన్న అవమానాన్ని గురించి వివరించింది. ప్రముఖ సంగీత దర్శకుడి స్టూడియోలో పాట పాడేందుకు వెళ్లానని మ్యూజిక్ డైరెక్టర్ తన చేతికి మైక్ ఇచ్చాడని తెలిపింది. ఆ పాట పాడిన తర్వాత మళ్లీ ఆ మైక్ ను అక్కడ పెట్టేసి వచ్చానని చెప్పింది. అయితే, ఇంటికి వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న ఆ సంగీత దర్శకుడి భార్య తనను పిలిచి అవమానించిందని చెప్పింది. మైక్ తీసుకుంటోన్న సమయంలో ఏమనుకుంటున్నావు? అంటూ కోప్పడిందని తెలిపింది. నువ్ ఏం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? అని ఆమె ప్రశ్నించడంతో నేనేం చేశానండి అని అడిగానని తెలిపింది.
మైకు తీసుకునే సమయంలో తన భర్త చేతికి నీ చేతి వేళ్లు తగిలాయంటూ అవమానించిందని చెప్పింది. అంటే నీ ఉద్దేశం ఏంటి? అంటూ ప్రశ్నించిందని తెలిపింది. దీంతో తాను కూడా గట్టిగా సమాధానం ఇచ్చానని సునీత వివరించింది. అయితే, ఆ ఘటనతో తాను చాలా బాధ పట్టానని చెప్పింది. అనంతరం బాగా ఏడ్చేశానని, ఇటువంటి ఘటనలు తన జీవితంలో ఎన్నో జరిగాయని వివరించింది. సంగీత దర్శకుడి భార్య వ్యాఖ్యలకు అదే స్థాయిలో సమాధానం ఇచ్చినప్పటికీ తాను మాత్రం చాలా బాధ పడ్డానని తెలిపింది.