Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో పెగాసస్‌పై చర్చకు విపక్షాల పట్టు. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ మంగళవారం కొలువుదీరాయి. వరుసగా 16వ రోజు ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలవ్వగా.. నేడు లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితా ఏర్పాటు చేసుకునే అధికారం కలిగిన ఓబీసీ సవరణ బిల్లు.. సమాఖ్య స్ఫూర్తికి ప్రతిబింబమమని కేంద్ర ప్రభుత్వ ం పేర్కొంది. అయితే ఓబీసీ సవరణ బిల్లుకు మద్దతివ్వాలని 15 విపక్ష పార్టీల నిర్ణయం తీసుకున్నాయి.
ఓబీసీ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం తమ మద్దతు ప్రకటించింది. పార్టీ తరఫున లోక్‌సభలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడనున్నారు. అదే విధంగా పోలవరంపై లోక్‌సభలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది. పోలవరం అంచనా వ్యయాన్ని కేబినెట్ ఆమోదించాలని నోటీసులు ఇచ్చింది. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. రాజ్యసభకు కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించింది.