Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: కుటుంబ కలహాలు ఎంతటి పరిస్థితికైనా దారి తీస్తాయనేది తెలి సిందే. కలబుర్గి జిల్లాలో భర్త చర్యలతో విసుగుచెందిన భార్య ఏకంగా తలపై బండరాయితో కొట్టి దారుణంగా హతమార్చిన సంఘటన చోటుచేసుకుంది. చించోళి తాలూకా మిరయాణ శివారు ప్రాంతం గనుల ప్రదేశంలో దారుణం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జి ల్లా బావిమడి తాండాకు చెందిన భధ్రు రాథోడ్, భార్య సుశీలాభాయిలు మిరయాణ తాండాకు మనవరాలి ఊయల వేడుకకోసం వచ్చారు. భార్యభర్తల మధ్యన కొంతకాలంగా విభేధాలు ఉన్నాయి. శనివారం ఊయల వేడుకకు వచ్చిన సందర్భంలోను ఇరువురి మధ్య గొడవ జరిగింది. కుటుంబ సభ్యులు వారించడంతో ఇరువురు మౌనంగా ఉండిపోయారు. కాగా సోమవారం మిరయాణ గ్రామ శివారులో భధ్రు రాథోడ్(48) హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. భార్య బండరాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి భధ్రురాథోడ్ను తల్లి సుశీలాభాయి హత్య చేశారని కుమారుడు మిరయాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.