Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: రాజకీయ నాయకుల మెప్పు కోసం అధికారులు తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మించిన అంశంలో ఐఏఎస్‌లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. తప్పును తప్పుగా చెప్పాలని అధికారులకు రఘురామ హితవు పలికారు. అనవసర అత్యుత్సాహం ప్రదర్శిస్తే శిక్ష తప్పదన్నారు.