Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉజ్వల 2.0 పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రారంభించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో పీఎంయూవై పథకం కింద మరో కోటి గ్యాస్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో ఎల్పీజీ కనెక్షన్లు పొందలేక పోయిన పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లను అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఉచిత ఎల్పీజీ కనెక్షన్‌తో పాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్ప్లేట్ అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే.. ఉజ్వల స్కీమ్‌లో రిజిస్ట్రేషన్ కోసం కనీస ప్రతాలు అవసరం కాగా.. ఉజ్వల 2.0లో వలసదారులు రేషన్‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు లేకుండానే గ్యాస్ కనెక్షన్లు అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమానికి మొత్తం 1000 మంది లబ్ధిదారులు హాజరయ్యారు. ఇందులో పది మందికి సిలిండర్లను అందించారు. ఈ సందర్భంగా ఉత్తరఖండ్, గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ కు చెందిన ఐదురుగు లబ్ధిదారులతో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు.