Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దళిత బంధు మాదిరి తమకు కూడా క్రీడా బంధు కావాలని క్రీడా కోచ్ ల డిమాండ్ చేశారు. మంగళవారం లాల్ బహదూర్ స్టేడియం వద్ద కోచ్‌లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్సీ అమలు జీఓకి విరుద్ధంగా క్రీడా శాఖా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టు పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా 30 మంది కోచ్‌లు సేవలు అందిస్తున్నట్టు వారు తెలిపారు. అయితే 28 ఏండ్ల నుంచి కాంట్రాక్డ్ పద్ధతిలో పని చేస్తున్న తమను క్రమబద్ధీకరరించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 29వ తేదీ వరకు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. తెలంగాణ నుంచి క్రీడాకారులు తయారవ్వాలంటే కోచ్‌ల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి ప్రభుత్వాన్ని చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్రీడా శాఖపై కనీస అవగాహన లేదని విమర్శించారు. తమ క్రమబద్ధీకరణపై హై కోర్ట్ అదేశాలను బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తమకు జీతాలు అరకొర ఉన్నాయని, నెలాఖరుకు ముష్టి వేస్తున్నట్టు చేస్తున్నారని వాపోయారు. వెంటనే ఖాళీగా ఉన్న 500 కోచ్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దళిత బంధు మాదిరి తమకు కూడా క్రీడా బంధు ప్రవేశపెట్డాలని కోరారు.