Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : విశ్వ క్రీడలు ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. ఒలంపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలని అభిమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడు గ్రెగ్ బార్క్లే స్పందించారు. లాస్ 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ లో క్రికెట్ నూ భాగం చేసేందుకు క్రికెట్ తరఫున బిడ్ వేసేందుకు ఐసీసీ సన్నాహాలు జరుపుతోందని శుభవార్త తెలిపారు. తాజాగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒలింపిక్స్ ను సజావుగా నిర్వహించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో పాటు జపాన్ ప్రభుత్వ యంత్రాంగానికి అభినం దనలు చెబుతున్నట్టు తెలిపారు. అయితే తమ క్రికెట్ కు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా అభిమానులున్నారన్నారు. దాదాపు 90 శాతం మంది క్రికెట్‌ను ఒలింపిక్స్ లో చూడాలని భావిస్తున్నా రన్నారు. కావున భవిష్యత్‌లోనైనా క్రికెట్ ను ఒలింపిక్స్ లో చూడాలని తాము భావిస్తున్నామని చెప్పారు. అందుకోసం ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు. అయితే తమ క్రీడను అందులో చేర్చడం అంత సులభమైనది కాదని తమకు తెలుసునన్నారు. కానీ క్రికెట్‌ను విశ్వక్రీడల్లో చేర్చేందుకు ఇదే సరైన సమయమన్నారు. దీనిపై బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా స్పందించారు. ఒలింపిక్స్ లో క్రికెట్ చోటు కల్పిస్తే అందులో భారత్ పాల్గొంటుందని చెప్పారు.