Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జఫర్గడ్ మండలం సాగరం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు తులు తాటికాయల సాయిలు (68), తాటికాయల ఎల్లమ్మ (55)లు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఎల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందగా సాయిలును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వర్ధన్నపేట పోలీసులు విచారణ చేపట్టారు.