Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తమ బోరును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారని ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన యాదాద్రి జిల్లా మోటకొండూర్ మండలం రాయికుంటపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొరటికంటి నర్సమ్మ.. గ్రామ చెరువు శిఖానికి సంబంధించిన ఎకరం భూమిలో 40 ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటోంది. అయితే పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు ఇటీవల బోరును సీజ్ చేశారు. దాంతో తీవ్ర మనస్థాపానికి ఆమె మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు హుటాహుటిన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సాగు భూమిని అక్రమంగా లాక్కోవడానికే బోరు సీజ్ చేశారని మోటకొండూర్ తహసీల్దారు కార్యలయం ముందు స్థానికులు ఆందోళన చేపట్టారు.