Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై హైకోర్టులో కొంతకాలంగా విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం మరోసారి దీనిపై విచారణ జరిగింది. చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ .. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేసింది. నేడు హెకోర్టులో విచారణ సందర్భంగా చెన్నమ నేని రమేశ్ జర్మనీ పౌరుడేనని కేంద్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న ఏఎస్జీ రాజేశ్వరరావు మరోసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఓసీఐ దరఖాస్తులోనూ ఆయన జర్మనీ పౌరుడుగా ప్రస్తావించారని.. జర్మనీ పాస్‌పోర్టును 2023 వరకు పునరుద్ధరించుకున్నారని పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరఫున న్యాయవాది రవికిరణ్ వాదనలు వినిపించారు. అయితే చెన్నమనేని జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నారని రమేశ్ తరఫు న్యాయవాది రామారావు కోర్టుకు చెప్పారు. పౌరసత్వాన్ని వదులుకుంటే ఓసీఐ దరఖాస్తులో జర్మనీ పౌరుడిగా ఎలా పేర్కొన్నారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకొని వివరిస్తామని రామారావు పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది.