Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమెల్యే గాదరి కిషోర్ కు స్వేరోస్ పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ఇటీవల బీఎస్పీలో చేరిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్... సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దాంతో సోమవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలపై ఎమ్మెల్యే గాదరి కిషోర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమన్నారు.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు సంపత్ స్వేరోస్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పపడ్డాడు. తాను సంపత్ స్వేరో అని చెప్పి.. బీఎస్పీ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌పై విమర్శలు చేస్తావా అంటూ... మరోసారి ఆయనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించాడు. ఏడేండ్లు గడిచిన తర్వాత ఇప్పుడు దళిత బంధు గుర్తుకువచ్చిందా అని ప్రశ్నించాడు. ప్రస్తుతం వారు మాట్లాడిన ఫోన్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.