Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలోని రాజకీయ పార్టీలకు దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం తమ అభ్యర్థులను ప్రకటించిన 48 గంటల్లోగా వారి నేర చరితకు సంబంధించిన వివరాలు బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పులో వెల్లడించింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడి ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
అభ్యర్థుల నేర చరిత్రను ప్రకటించని పార్టీల గుర్తులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. అంతేకాక ఫిబ్రవరి 2020 సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించని పార్టీల మీద కోర్టుధిక్కరణ చర్యలు తీసుకోవాల్సిందిగా పిటిషన్లో అభ్యర్థించారు. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులను ఎన్నుకోవడానికి గల కారణాలు.. వారి నేరాల వివరాలను పార్టీ వెబ్సైట్లో పొందుపర్చకపోవడానికి గల కారణాలను తెలియజేయాలని అన్ని పార్టీలను సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించని పార్టీల గుర్తులను రద్దు చేస్తామని జాతీయ ఎన్నికల కమిషన్ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపింది. అంతేకాక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల మీద నమోదయిన క్రిమినల్ కేసులను ఆయా రాష్ట్రాల హైకోర్టు అనుమతి లేకుండా ఉపసంహరించడానికి వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.