Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తుళ్లూరు మండలంలోని అబ్బురాజుపాలెంలో అక్రమ మైనింగ్‌పై మహిళా రైతులు ఆందోళన చేపట్టారు. మంగళవారం అక్రమ మైనింగ్ జరిగిన స్థలానికి పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన చేపట్టారు. అమరావతి ఆస్తులను కాపాడాలంటూ మహిళలు నినాదాలు చేశారు. కన్నతల్లి లాంటి మట్టిని దొంగిలించి అమ్ముకుంటున్నారని అక్రమార్కులపై మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో గత రెండు రోజుల క్రితం మైనింగ్ మాఫియా హల్ చల్ చేసింది. ఈ సంఘటనపై రాజధాని మహిళా రైతులు, దళిత జేఏసీ నాయకులు నిరసన తెలిపారు.