Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 10 కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణం కేసులో జనసేన ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టివాసు సహా ఏడుగురిని మంగళవారం గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. పెదకాకాని మండలం అగంతవరప్పాడుకు చెందిన కె. నారాయణమ్మ తన 1.42 ఎకరాల భూమిని తన మరణానంతరం మేనల్లుడు ఒడ్డెంగుంట శివసాగర్, అతని భార్య పద్మజకు దక్కేలా వీలునామా రాశారు. 2012లో నారాయణమ్మ మృతి చెందింది. అనంతరం ఆమె మేనల్లుడు శివసాగర్ కూడా కొద్దికాలానికి మరణించాడు. అయితే ఇదే అదునుగా భూమిని కబ్జా చేసేందుకు యేమినేడి అమ్మయ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాధికారెడ్డి, రామనుజంలు కలిసి ఓ మీడియా ప్రతినిధి ద్వారా రూ.10 కోట్ల విలువైన భూమిని రూ.3 కోట్లకు గుత్తా సుమన్‌కు అమ్మేందుకు కుంచనపల్లి మాజీ సర్పంచి బడుగు శ్రీనివాసరావు పేరిట నకిలీ వీలునామా చేయించారు. లింక్ డాక్యుమెంట్ల కోసం మరో ఇద్దరి పేరిట మార్చారు.
అయితే ఇది తెలిసిన బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ముందుగా జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసుతో సహా మరో కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం మంగళవారం వారిని అరెస్ట్ చేశారు.