Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మండిపడ్డారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన మహ్మద్ షబ్బీర్ అనే నిరుద్యోగి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడగా.. ఆ కు టుంబాన్ని ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆమె ప్రతి మంగళవారం చేపడుతున్న నిరుద్యోగ దీక్షను సిరిసేడులో చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చందమామ లాంటి పిల్లలు చనిపోతున్నారు అన్నది కేసీఆరే కదా. .మరి ఇప్పుడు ఏమైంది అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్ నేతలను నిలదీయాలన్నారు. అలాగే బీజేపీని కూడా నిలదీయాలన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏవీ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా ఏనాడూ సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేదని విమర్శించారు. ఎప్పుడు రేటు వస్తుందా, ఎప్పుడు అమ్ముడు పోదామా అని ఆ పార్టీ నేతలు చూస్తారని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నిక వస్తేనే దళితులు బంధువులు అయ్యారా? ఓ పథకం ఎన్నిక కోసమే అని చెప్పే సీఎం దేశంలోనే లేడు అని అన్నారు.
దళితబంధు ద్వారా దళితులకు ఇచ్చేది కేసీఆర్ డబ్బేమీ కాదు అని అన్నారు. దళితులకు కేసీఆర్ 51 లక్షలు బాకీ ఉన్నాడు. ఇప్పుడు ఇచ్చే పది లక్షలు తీసుకోవాలని తర్వాత 41 లక్షలు వసూలు చేయండి అని అన్నారు. దళితులంతా హుజురాబాద్ వచ్చి వారి ఓటు హక్కు ఇక్కడ నమోదు చేసుకోవాలన్నారు.