Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉప ఎన్నికలు వస్తేనే తప్ప ముఖ్యమంత్రికి దళితులు, గిరిజనులు, బడుగు, బలహీనవర్గాలు గుర్తుకొస్తారని టీపీసీసీ ఎంపీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి దళిత, గిరిజన దండోరా సభలో విమర్షించిన సంగతి విధితమే. దీనిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ..చంద్రబాబు మోచేయి నీళ్లు తాగే రేవంత్‌ను నమ్మడం ఎంత వరకు కరెక్టు? అని ప్రశ్నించారు. శవాలపై పేలాలు ఎరుకునే రాజకీయం రేవంత్ రెడ్డి రోజుకో పార్టీ, పూటకో మాట మాట్లాడుతున్నారని అన్నారు. 1981లో ఇంద్రవెళ్లిలో వందలమందిని పిట్టలను కాల్చినచంపిన కాంగ్రెస్ పార్టీ , ఆనాడు గిరిజనులను చంపి, ఇవ్వాళ స్మారకం కడతారా? అని ప్రశ్నించారు.దళితులకు పేలాలు పంచడం తప్ప కాంగ్రెస్ ఏం చేయలేదని, ఆదివాసీలను చంపిందే కాంగ్రెస్ పార్టీనే అని ఆయన ఆరోపించారు. 60ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క దళిత వ్యక్తిని ప్రధానిని చేసిందా? దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ దేశం, రాష్ట్రంలో ఒక్క పథకమైన తెచ్చిందా? అని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.