Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలో రైతు బీమా కోసం రూ.1450 రూపాయలు కేటాయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.2021 - 2022 సంవత్సరానికి గాను రైతుబీమా కోసం ఎల్ఐసీ ప్రతినిధులకు మంగళవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో రైతుకు ప్రీమియం చెల్లించి బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.