Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,461 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనాతో 15 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,564 కు చేరగా పాజిటివ్ కేసుల సంఖ్య 19,85,182 కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 2,113 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 19,52,736 మంది ఏపీలో డిశ్చార్జ్ కాగా ఏపీలో ప్రస్తుతం ఇంకా 18,882 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.