Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నాశనం చేస్తోందని రాహుల్ విమర్శించారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పార్లమెంట్ లో చర్చించడానికి సర్కార్ అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. వాస్తవాలను ప్రచురించడానికి మీడియాకు కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. వాస్తవాలు ప్రచూరిస్తే తమ ఉద్యోగాలు పోతాయేమోనని జర్నలిస్టులు భయపడుతున్నారని అన్నారు. జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న రాహుల్.. కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.