Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మాః అధ్యక్ష పదవికి త్వరలో పోటీ చేయనున్న నటి హేమకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు చేస్తూ ఆమె సభ్యులతో మాట్లాడిన వాయిస్ రికార్డ్ బయపడింది. దీనిపై స్పందించిన నరేశ్.. హేమ వ్యాఖ్యలను ఖండించారు. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారన్నారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో హేమకు క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.