Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తాను, ఆరెస్సెస్ రిజర్వేషన్లకు గట్టి మద్దతుదారులమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హొసబలే అన్నారు. మేకర్స్ ఆఫ్ మోడర్న్ దళిత్ హిస్టరీ పుస్తకావిష్కరణ సభలో మంగళవారం ఆయన మాట్లాడారు. దళితుల చరిత్ర లేకపోతే భారత దేశ చరిత్ర అసంపూర్ణమవుతుందన్నారు. భారత దేశ చరిత్ర, దళితుల చరిత్ర వేర్వేరు కాదన్నారు. సమాజంలోని ఓ వర్గం అసమానతలను అనుభవిస్తున్నంతవరకు రిజర్వేషన్లు కొనసాగాలని ఆయన అన్నారు.