Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తాను ప్రాక్టీస్ కోసం స్టేడియానికి వెళ్లడానికి పాస్ జారీ చేసి పోలీసులు తనకు ఎంతో సహకరించారని ఒలంపిక్స్ లో కాంస్య పతక విజేత పీవీ సింధు తెలిపారు. విశ్వ క్రీడల్లో తాను గెలిచిన కాంస్య పతకాన్ని పోలీసుల సేవకు అంకితం చేస్తున్నానని ఆమె అన్నారు. మంగళవారం ఆమెను హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఘనంగా సన్మానించారు. సీపీ అంజనీకుమార్ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి.. శాలువాతో సత్కరించారు. అదనపు డీఐజీలు శిఖా గోయల్, అనిల్ కుమార్ తదితర ఉన్నతాధికారులు ఆమెను అభినందించారు.
ఈ సందర్భంగా 'సెకండ్ వేవ్` పుస్తకాన్ని సింధు ఆవిష్కరించారు. రెండో విడత లాక్డౌన్ సందర్భంగా నిర్వహించిన విధులకు సంబంధించిన వివరాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో పోలీసులు ఎంతో కష్టపడి పని చేశారన్నారు. తనకు ప్రాక్టిస్ కోసం కూడా ఎంతో సహకరించారని కొనియాడారు.