Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న అంజనగిరి జలాశయంలో , నిర్వాసితులవుతున్న వారితో పాటు ఎల్లంపల్లి నిర్వాసితులకు పరిహారం ఇవ్వనున్నట్టు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన అంజనగిరి తండా, దుల్యానాయక్ తండా, వడ్డెగుడిసెలు, సున్నపు తండా, బోడబండ తండాకు చెందిన 102 కుటుంబాలకు పరిహారాన్ని ఆమోదించారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రెండు పడకల గదుల ఇంటి కోసం ఐదు లక్షలా నాలుగు వేలతోపాటు ఏడున్నర లక్షల రూపాయల నగదు, 250 చదరపు గజాల స్థలాన్ని పరిహారంగా ఇవ్వను న్నారు. 18 ఏండ్లు దాటిన 15 మంది మేజర్లకు 250 చదరపు గజాల స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయల నగదు పరిహారంగా ఇవ్వనున్నారు. ఇందుకు 13.54 కోట్ల రూపాయల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు ఎల్లంపల్లి జలాశయంలో నీటమునిగిన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ముక్కట్రావుపేటకు చెందిన 488 మిగిలిన కుటుంబాలకు మూడు లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని ఖరారు చేశారు.