Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచంలోనే నెంబర్ వన్ సోషల్ మీడియా సంస్థ అయిన ఫేస్‌బుక్‌ను టిక్‌టాక్ అధిగమించింది. 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా యూజర్లు డౌన్లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ నిలిచింది. సోషల్ మీడియా యాప్స్ డౌన్లోడ్స్ మీద రముఖ బిజినెస్ జర్నల్ నిక్కీ ఏషియా చేపట్టిన గ్లోబల్ సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించింది. టిక్ టాక్ తన మార్కెట్‌ను గ్లోబల్‌గా విస్తరించుకుంటూ వెళ్లడంతో డౌన్‌లోడ్స్‌లో టాప్ పొజిషన్లోకి వచ్చిందని జర్నల్ వెల్లడించింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా యాప్స్ డౌన్‌లోడ్‌లో టిక్‌టాక్ నాలుగో స్థానంలో నిలవగా ఇప్పుడు మొదటి స్థానానికి ఎగబాకింది. ఫేస్బుక్ కు చెందిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మెసేంజర్ యాప్‌లు టాప్ 10 లో కొనసాగుతున్నాయి. కాగా టిక్‌టాక్ భారత్ లో నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ టిక్ టాక్ ను తిరిగి భారత మార్కెట్లలోకి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.