Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 'నిందితుడు కేవలం 11 నిమిషాలే లైంగిక దాడి చేశాడు.. బాధితురాలిని పెద్దగా గాయపర్చలేదు. కాబట్టి అతడికి విధించిన శిక్షను తగ్గిస్తున్నాం` ఇది ఓ లైంగికదాడి కేసులో స్విట్జర్లాండ్ బాసెల్ కోర్టు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాసెల్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు.
గతేడాది ఫిబ్రవరిలో స్విట్జర్లాండ్ వాయువ్య ప్రాంతంలోని ఓ నగరానికి చెందిన బాధితురాలి ఫ్లాట్ లోకి కిపోర్చుగల్కు చెందిన 31 ఏండ్ల వ్యక్తి వచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు. అతనికి మరో 17 ఏండ్ల మైనర్ సహకరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టులో హాజరపరిచారు. దాంతో 2020 ఆగస్టులో కోర్టు 31 ఏండ్ల వ్యక్తికి 4 సంవత్సరాల 3నెలలు శిక్ష విధించింది. మైనర్‌ను జువైనల్ హోంకి తరలించింది. అయితే తాజాగా కోర్టు గతంలో నిందితుడికి ఇంతకు ముందు విధించిన శిక్షను తగ్గించింది. 51 నెలల జైలు శిక్షను 36 నెలలకు తగ్గిస్తూ బాసెల్ కోర్టు ప్రెసిడెంట్ కోర్ట్ ప్రెసిడెంట్ జస్టిస్ లిసెలెట్ హెంజ్ నిర్ణయం తీసుకున్నారు. స్విస్ న్యూస్ వెబ్సైట్ 20 మినిట్స్ ప్రకారం నిందితుడిని ఆగస్టు 11 న విడుదల చేయవచ్చని తెలిపింది. తీర్పును వెలువరుస్తూ జస్టిస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాధితురాలు కొన్ని తప్పుడు సంకేతాలు పంపి.. నిప్పు రాజేసిందన్నారు. లైంగికదాడి జరిగిన రోజున ఆమె మరో వ్యక్తితో కలిసి నైట్‌క్లబ్‌కు వెళ్లి ఎంజాయ్ చేసిందని.. ఇవన్ని నిందితుడిపై ప్రభావం చూపాయన్నారు. లైంగికదాడి కూడా 11 నిమిషాలపాటే సాగిందని.. బాధితురాలికి ఎక్కువ గాయాలు కాలేదని.. అందుకే అతడికి శిక్షను తగ్గిస్తున్నట్టు తీర్పు చెప్పారు.దాంతో ఈ తీర్పుకు వ్యతిరేకంగా బాసెల్ నగరవ్యాప్తంగా ప్రజలు నిరసన తెలుపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ తీర్పుకు వ్యతిరేకంగా నెటిజన్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.