Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మేడ్చల్‌లో దారుణం చోటుచేసుకుంది. తనతో రమ్మంటే రాలేదని ఓ వివాహితను ఆమె మాజీ ప్రియుడు హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహర్ రాష్ట్రానికి చెందిన పూజ (21)కు ఏప్రిల్ నెలలో రాజేంద్రన్ వర్మ అనే వ్యక్తితో వివాహమైంది. అనంతరం ఆ దంపతులు హైదరాబాద్ కు వచ్చి కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పరిధిలోని వినాయక్‌నగర్‌లో నివసిస్తున్నారు. అయితే ఆ యువతి ఆమె, మాజీ ప్రియుడు రాకేష్‌తో చాటింగ్ చేసేది. అలాగే ఫోన్లో మాట్లాడేది. ఈ క్రమంలో మంగళవారం రాకేష్ మరో స్నేహితుడితో కలిసి పూజ ఇంటికి వచ్చాడు. ఆమెను తనతో బిహార్ రావాలని కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే కోపంతో రాకేష్ తలగడ తీసుకుని పూజను ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.