Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గడిచిన 24 గంటలకు గాను తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్ ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది. రాష్ర్టంలో గడిచిన 24 గంటల్లో 89,037 కరోనా పరీక్షలు నిర్వహించగా 494 కొత్త కేసులు నమోదు కాగా ఈ మాహమ్మారితో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,50,353కు చేరింది. మరణాల సంఖ్య 3,831కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 621 మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,38,410కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,112 యాక్టివ్ కేసులున్నాయి.