Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో దారుణం చోటు చేసుకున్నది. అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో 25 మంది సైనికులు మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ధ్రువీకరించారు. బెర్బర్స్ పర్వతం, కబైలీ ప్రాంతంలో మంటలు వ్యాపించగా.. సుమారు వంద మంది పౌరులను సైన్యం కాపాడిందని ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి ట్వీట్ చేసింది. మంటలను అదుపు చేస్తున్న క్రమంలో నలుగురు సైనికులు తీవ్రగాయాలకు గురయ్యారు. మరో ఏడుగురికి గాయాలైనట్లు జాతీయ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. కనీసం మరో ఏడుగురు పౌరులు మృతి చెందారని అంతర్గత మంత్రిత్వ శాఖ ఇంతకు ముందు పేర్కొంది. కబైలీ ప్రాంతంలో, పలుప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. అల్జీరియన్ అధికారులు పౌరులు అగ్ని ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు, ఆయా ప్రాంతాల నుంచి వారిని ఖాళీ చేయడానికి సహాయం అందించేందుకు ప్రభుత్వం సైన్యాన్ని పంపింది. చాలా ప్రాంతంలో అడవుల్లో మంటలు వ్యాపించగా.. కబైలీ ప్రాంతంలోని కుటుంబాల జీవనోపాధిని అందించే ఆలివ్ చెట్లు కాలిపోగా.. పశువులు మృత్యువాతపడ్డాయి.