Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్ ఫ్లో 1,06,832 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,14,377 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 589.70 అడుగులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311.1486 టీఎంసీలుగా ఉంది.