Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల్లూరు: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్వీ)-ఎఫ్10 వాహకనౌక ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ బుధవారం తెల్లవారుజామున 3.43 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 26 గంటలు కొనసాగిన తర్వాత గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్ఎల్వీ వాహకనౌక నింగిలోనికి దూసుకెళ్లనుంది. దీని ద్వారా 2,268 కిలోల బరువు ఉన్న జీఐశాట్-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నారు. ఉపగ్రహం ద్వారా దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించే భూ పరిశీలన అంశాలను తెలుసుకునే వీలుంది.