Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మెదక్ కారు దగ్ధం కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కారు డిక్కీలో కాలిపోయి ఉన్న మృతదేహం లభ్యమైంది. మృతుడు వ్యాపారి ధర్మకార్ శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. కృత్రిమ దంతాలు ద్వారా శ్రీనివాస్ మృతదేహం అని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. వివాహేతర సంబంధం కారణంగా హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వేరే మహిళలతో వివాహేతర సంబంధం ఉందని, తరుచు తనతో గొడవలు పడేవాడని ఫిర్యాదులో శ్రీనివాస్ భార్య పేర్కొంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో శ్రీనివాస్‌కు గొడవలు ఉన్నట్లు సమాచారం. పోలీసులు అదుపులో నలుగురు అనుమానితులున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.