Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచిర్యాల: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద ఏఐటీయూసీ 48 గంటల దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారన్నారు. యాజమాన్యం తీరుతో సింగరేణి సంక్షోభం దిశగా వెళుతోందన్నారు. సింగరేణి నిధులను టిఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. టీబీజీకేఎస్ నేతలు పైరవీల్లో మునిగి తేలుతున్నారని వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు.