Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణికి సంబంధించిన ఇళ్లు, సంస్థలే లక్ష్యంగా మంగళవారం తమిళనాడులో 60 చోట్ల డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీకరప్షన్ (డీవీఏసీ) సోదాలు నిర్వహించింది. ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ దాడులు జరిగాయి. వేలుమణితో సహా 17 మందిపై డీవీఏసీ కేసుల్ని నమోదు చేసింది. డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం గత నెల అన్నాడీఎంకేకు చెందిన రవాణాశాఖ మాజీ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్పై ఐటీ దాడులు జరిగాయి. ప్రస్తుతం నగరాభివృద్ధి శాఖ మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి టార్గెట్గా కోయంబత్తూరులో 42 చోట్ల, చెన్నైలో 16 చోట్ల, దిండుగల్, కాంచీపురంలలో తలా ఓ చోట డీవీఏసీ అధికారులు తనిఖీలు చేపట్టారు.