Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మన దేశంలో లైంగికదాడుల పర్వం కొనసాగుతోంది. ఇద్దరు మైనర్ బాలికలను నలుగురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. తల్లిని కొట్టి.. ఆమె కళ్ల ఎదుటే లైంగికదాడికి ఒడిగట్టారు. అనంతరం పురుగుల మందును తాగించారు. సోనిపత్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరా ప్రకారం.. హరియాణాలో ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి చిన్న ఇంట్లో నివసిస్తోంది. ఒక కూతురి వయసు 14, మరో కుమార్తె వయసు 16 ఏళ్లు. తల్లి కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఐతే వీరి పక్క ఇంట్లోనే కొందరు వలస కార్మికులు నివసిస్తున్నారు.
ఆగస్టు 6న పక్క ఇంట్లో ఉండే నలుగురు వ్యక్తులు ఆమె ఇంట్లో చొరబడ్డారు. వారి వయసు 22 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుంది. రాత్రివేళ ఇంటి లోపలికి చొరబడి గడియవేశారు. తల్లిపై దాడి చేసి.. కూతుళ్లపై లైంగికదాడికి పాల్పడ్డారు. రాత్రంతా వారికి నరకం చూపించారు. అంతటితో ఆగకుండా ఇంట్లలో ఉన్న పురుగుల మందును తీసుకొని.. వారితో బలవంతంగా తాగించారు. అనంతరం కాసేపటికే అక్కాచెల్లెళ్లు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇక్కడ జరిగిన దాని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని తల్లిని హెచ్చరించారు దుండగులు. ఎవరైనా అడిగితే పాము కరిచిందని చెప్పమన్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కూతుళ్ల ఆరోగ్యం క్షీణించడంతో వారిని ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఏం జరిగిందని డాక్టర్లు అడిగితే పాము కరిచిందని చెప్పారు. అప్పటికే ఓ కూతురు మరణించింది. మరో కూతురు చికిత్స పొందుతూ కన్నుమూసింది. వారి పరిస్థితిని చూసి డాక్టర్లకు అనుమానం వచ్చింది. పాము కరిచిన ఆనవాళ్లు లేవు. ఒంట్లో పురుగుల మందు అవశేషాలు ఉన్నాయి. ఏదో జరిగిందని.. తల్లిపై డాక్టర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. చివరకు జరిగిన విషయాన్ని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది ఆ మహిళ. అనంతరం డాక్టర్ల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గురుగ్రామ్‌లో కూడా 17 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. ఈ క్రమంలోనే తమ కూతురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.